విశాఖపట్నం న్యూస్ లీడర్ ,
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపును యావత్ భారతావని స్వాగతించింది. కరోనాపై యుద్ధానికి నడుం కట్టింది. ఈ క్రమంలో దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు, అధికారులు, పోలీసులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆదివారం సాయంత్రం 5గంటలకు యావత్ దేశం చప్పట్లతో మార్మోగింది. ప్రజలు తమ ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి కరోనాపై పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరురాష్టాల సీఎం లు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , కేసీఆర్, తెలంగాణ గవర్నర్ తమిళసై, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.